సాదరణంగా క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్లు వివిధ రకాలుగా అవుట్ అవుతూ ఉంటారు కొంతమంది క్యాచ్ అవుట్ అయితే.. ఇంకొంతమంది రన్ అవుట్ ఉంటారు.. మరి కొంతమంది స్టంప్ అవుట్ అయి పెవిలియన్ చేరుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం బ్యాట్స్మెన్లు ఊహించనీ రీతిలో వికెట్ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా సిక్సర్ బాదిన బ్యాట్స్మెన్ అదే బంతికి అవుట్ అయ్యాడు. ఈ ఘటన కౌంటి ఛాంపియన్షిప్ 2023లో చోటుచేసుకుంది. మిడిల్ సెక్స్ కెప్టెన్ టోపీ రోలాండ్ జోన్స్ సిక్స్ కొట్టి అవుట్ అయ్యాడు.
ఇటీవలే వార్విక్ షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో మిడిల్ సెక్స్ కెప్టెన్ టోబి రోలాండ్ జోన్స్ హిట్ వికెట్గా వెనుతిరిగాడు. రోలాండ్ 14 బంతులో 21 పరుగు చేసి మంచి ఊపు మీద కనిపించాడు. ఈ క్రమంలోనే ఎడ్ బెర్నార్డ్ బౌలింగ్లో ఎదుర్కొన్న బంతిని సిక్సర్ గా మలిచాడు. అయితే అంపైర్ కూడా సిక్స్ అని సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ షాట్ ఆడిన అనంతరం నియంత్రణ కోల్పోవడంతో బంతి వికెట్లను తాకింది. వెంటనే బైల్స్ కింద పడిపోయాయ్. దీంతో out గా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారగా పాపం దురదృష్టం అంటే ఇదే.. సిక్స్ కొట్టి అవుట్ అయిన తొలి బాట్స్మన్ ఇతనే నేమో అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి