ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఇండియన్ క్రికెట్ బోర్డు. ఐతే ఈ పేరు తప్ప మన బీసీసీఐ ఒరగబెట్టింది ఏమి లేదు. మన స్టేడియం లలో ఉండే వసతులు, సీట్లు చూస్తే, బీసీసీఐ ఎలా వ్యవహరిస్తోందో అర్ధమవుతుంది. తన చేతగాని తనంతో బీసీసీఐ ఎప్పటికప్పుడు విమర్శలకు గురవుతూ ఉంటుంది. తాజాగా ఆసియ కప్ లో మరోసారి బీసీసీఐ పై విమర్శలు మొదలయ్యాయి. ఐతే దీనికి కారణం బీసీసీఐ కాదు. శ్రీ లంక క్రికెట్ బోర్డు. అసలు విషయం ఏమిటంటే?

ఆసియ కప్ మ్యాచ్ లు పాకిస్తాన్, మరియు శ్రీలంకలో జరుగుతున్నాయి. ఇప్పటివరకు  పాకిస్తాన్ లో జరిగిన అన్ని మ్యాచ్లు ఎటువంటి అంతరాయం లేకుండా బాగానే జరిగాయి. కేవలం పాకిస్తాన్, బాంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో మాత్రం కొన్ని సాంకేతిక లోపాల వలన మ్యాచ్ ఒక పావు గంట ఆగిపోయింది. ఒక ఫ్లడ్ లైట్ పనిచేయకపోవడం వలన ఆట ఆగవల్సి వచ్చింది. దీనికి కారణం పాకిస్తాన్ బోర్డు లాహోర్ ఎలక్ట్రికల్ బోర్డు కు చెల్లించవలసిన బకాయిలు కట్టకపోవడమే. ఐతే వెంటనే పాకిస్తాన్ బోర్డు తేరుకొని పావుగంటలో బకాయిలు చెల్లించి మ్యాచ్ ను ప్రారంభించింది. పాకిస్తాన్ బోర్డు చాలా ఇబ్బందుల్లో ఉంది. పాకిస్తాన్ దేశం కూడా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఐనాసరే పాకిస్తాన్ బోర్డు ఫీల్డ్ ను ఆరబెట్టేందుకు ఏకంగా హెలీకాఫ్టర్లను రంగంలోకి దింపింది. ఆ ఫోటోలను చూసిన ఐపీల్ ఫాన్స్ అవాక్కయ్యారు.

ఐపీల్ బ్రాండ్ వేల్యూ లక్ష కోట్లు. కేవలం ఐపీల్ మీడియా రైట్స్ తోనే బీసీసీఐ 43 వేల కోట్లు సంపాదించింది. కానీ మన గ్రౌండ్ ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్లు, ఐరన్ బాక్సులు వాడుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్ధిక మాన్యంతో సతమతమవుతున్న శ్రీ లంక బోర్డు బీసీసీఐ కంటే మంచి పద్దతులను ఆచరిస్తోంది. ఫీల్డ్ ను ఆరబెట్టేందుకు బీసీసీఐ  స్పాంజ్  లను వాడుతుంటే, శ్రీ లంక బీసీసీఐ కంటే మంచి షీట్లను వాడింది. అలాగే ఫీల్డ్ ను ఆరబెట్టేందుకు ఫ్యాన్లను తీసుకొచ్చింది. ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ లో కూడా బీసీసీఐ ఇలాగె ప్రవర్తస్తే ఇండియా పరువు పోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Acc