క్రికెట్ ను అందరు కూడా జెంటిల్మెన్ గేమ్ గా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇక క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ప్రేక్షకులు అందరినీ కూడా కడుపుబ్బా నవ్వించే ఎన్నో ఫన్నీ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కేవలం ఫన్నీ సంఘటనలు మాత్రమే కాదండోయ్ కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులను షాక్ కి గురి చేసే ఘటనలు కూడా జరుగుతాయి. ఆటగాళ్లు ఏకంగా గాయం బారిన పడటం జరుగుతుంది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు గాయాలు పైనకి కనబడకపోయినా ప్లేయర్లు మాత్రం నొప్పితో విలవిలలాడిపోతూ ఉంటారు.


 ఇంకొన్నిసార్లు మాత్రం ఏకంగా గాయం అయ్యి రక్తం కారడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిది జరిగింది. ఏకంగా భారీ టార్గెట్ ను చేదించేందుకు పాకిస్తాన్ సర్వశక్తులు ఒడ్డింది అని చెప్పాలి. కానీ చివరికి దారుణమైన ఓటమిని చవిచూసింది. తక్కువ పరుగులకు కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఇక పాకిస్తాన్ పీకల్లోకి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే ఒక పాకిస్తాన్ ఆటగాడు తీవ్రంగా గాయపడ్డాడు.  ఏకంగా మొఖం నుండి  రక్తం కూడా కారడంతో అందరూ షాక్ అయ్యారు.


 జడేజా మ్యాచ్ లో భాగంగా 21 ఓవర్ వేశాడు   అయితే జుడేజా వేసిన బంతిని స్లీప్ షాట్ ఆడబోయాడు పాకిస్తాన్ ఆల్ అఘా సల్మాన్. ఈ క్రమంలోనే బంతి అతని మోహానికి తగిలింది. కంటి దగ్గర తీవ్రంగా గాయం అయింది. ఈ క్రమంలోనే  రక్తం కూడా వచ్చింది.  దీంతో రక్తం కారుతూ ఉండడంతో వెంటనే అటు టీమ్ ఇండియా ప్లేయర్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఫీజిషియన్ వెంటనే మైదానంలోకి పరిగెత్తుకు రావలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. కంకషన్ అవకాశం ఉన్నప్పటికీ తిరిగి బ్యాటింగ్ కొనసాగించడానికి అతను అంగీకరించాడు  ఇక కాసేపు అంతరాయం అనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: