కానీ ఈ వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది అన్న విషయం తెలిసిందే. వరుస పరాజుయాలతో సతమతమై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఏకంగా వరుసగా నాలుగు ఓటములు చవిచూసిన జట్టు.. ఇక సెమి ఫైనల్ అవకాశాలను కోల్పోయినట్లే అని అభిమానులు మాత్రం ఆశలు వదులుకున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఈ జట్టుకు అదృష్టం కలిసి వచ్చి అటు మిగతా టీమ్స్ ఓటములతో సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు మాత్రం అంతకంతకు మెరుగవుతూ వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.
అయితే పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఇక ఆ జట్టు తురుపు ముక్క అని పిలుచుకునే షాహిన్ ఆఫ్రిది మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కీలక సమయంలో వికెట్లు పడగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రదర్శనతో ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు షాహిన్ ఆఫ్రిది. కొన్ని రోజుల క్రితం 640 పాయింట్స్ తో ఎనిమిదో ర్యాంకులో ఉన్న షాహిన్.. వరల్డ్ కప్ ప్రదర్శనతో నెంబర్ వన్ ర్యాంకు కు ఎగ బాకాడు. ప్రస్తుతం 673 పాయింట్లతో నెంబర్ వన్ బౌలర్గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ జోష్ హేజిల్ వుడ్ 663 పాయింట్లతో రెండవ ర్యాంకులో.. టీమ్ ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ 656 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి