కాగా ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇలా తమ జట్టును ప్రపంచ ఛాంపియన్గా నిలపడమే లక్ష్యంగా ప్రతి ఆటగాడు అదరగొట్టేస్తున్నాడు. జట్టు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా వ్యక్తిగత ప్రదర్శన విషయంలో మాత్రం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ అరుదైన రికార్డులు సృష్టిస్తున్నారు కొంతమంది ప్లేయర్లు. అయితే ప్లేయర్లు ఇలా మంచి ప్రదర్శన చేసి రికార్డులు కొల్లగొట్టడం ఎన్నోసార్లు చూశాం. కానీ ప్రస్తుతం భారత వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో మాత్రం ఏకంగా ప్లేయర్లు మాత్రమే కాదు ప్రపంచ కప్ టోర్నీనే రికార్డులు సృష్టిస్తూ ఉంది.
ఇప్పటికే 48 ఏళ్ల ప్రపంచకప్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు నమోదైన ఎడిషన్ గా 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ రికార్డు సృష్టించింది ఇక ఇప్పుడు సెంచరీల విషయంలో కూడా ఈ వరల్డ్ కప్ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకుంది. 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు నమోదు అయిన సీజన్ గా ఈ వరల్డ్ కప్ ఎడిషన్ నిలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో 39 సెంచరీలు నమోదు అయ్యాయి. ఇటీవల ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసిన సందర్భంగా ఈ రికార్డు నమోదయింది. ఇక ఈ వరల్డ్ కప్ లో డికాక్ నాలుగు, కోహ్లీ, రచిన్ చెరో మూడు సెంచరీలు.. మిచెల్, శ్రేయస్, వార్నర్, దస్సేన్, మార్ష్, మాక్స్వెల్ తలో రెండు.. రోహిత్, మార్కరమ్, మలాన్, కేఎల్ రాహుల్ తో పాటు మరికొందరు ఈ వరల్డ్ కప్ లో తలో ఒక్కో సెంచరీ సాధించారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి