ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ భారత క్రికెట్ అభిమానులందరికీ కూడా ఎంతో స్పెషల్ అనే విషయం తెలిసిందే. ఎందుకంటే 2011లో సొంత గడ్డ పైన జరిగిన వరల్డ్ కప్ లోనే భారత జట్టు టైటిల్ గెలిచింది. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియా టైటిల్ సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉంది అని చెప్పాలి. ప్రపంచ కప్ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్థానం కొనసాగిస్తున్న రోహిత్ సేన.. ఇక ఇటీవల సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి చీరస్మరణయన విజయాన్ని సాధించి ఫైనల్ అడుగుపెట్టింది అని చెప్పాలి.


 అయితే ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది భారత జట్టు. తప్పక విజేతగా నిలుస్తుంది అని అటు అభిమానులు అందరూ కూడా గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. సాధారణ లీగ్ దశ మ్యాచ్ లు అంటేనే భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కొన్ని గంటల ముందు నుంచి టీవీలకు అతుక్కుపోతు  ఉంటారు. ఇక ఫైనల్ మ్యాచ్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఇక ఎంతోమంది జనాలు మరో పనితో బిజీ కాబోతున్నారట.


 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వస్తుంటే ఇంకో పని పెట్టుకోవడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం రోజునే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు ఉన్నాయి. దీంతో ఆ పెళ్లి పిల్లలతో బిజీ కాబోతున్నారు. ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే కొన్ని పెళ్లి మండపాలలో ఫైనల్ మ్యాచ్ చూడటం.. మిస్ అవ్వకుండా ఉండేందుకు.. స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటు కూడా చేయబోతున్నారట. ఒకవేళ పెళ్లిలో రాత్రి ముహూర్తం ఉంటే ఇటు తాళి కట్టడం అక్కడ ఇండియా కప్ ఎత్తే సన్నివేశాలు ఒకేసారి పూర్తవుతాయి అని క్రికెట్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc