అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇలా ఏదైనా జట్టుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.. అంటే ఇక ఆ క్రికెట్ బోర్డు ఐసీసీ ఈవెంట్స్ కి ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం నేపథ్యంలో.. 2024 అండర్ 19 వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇక ఈ వరల్డ్ కప్ ఎక్కడికి తరలి వెళ్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించిన నేపద్యంలో అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2024 వేదికను శ్రీలంక నుండి దక్షిణాఫ్రికాకు మార్చినట్లు ఐసిసి ప్రకటించింది. అయితే లంక బోర్డుపై నిషేధం కారణంగానే ఆతిథ్య వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకున్నాము అంటూ వివరణ ఇచ్చింది ఐసీసీ. ఈ నిర్ణయం వల్ల శ్రీలంక దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ పై ఎలాంటి ప్రభావం ఉండదని ఐసిసి బోర్డు సభ్యుడు తెలిపారు. కాగా వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 19 వరకు కూడా అండర్ 19 ప్రపంచ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి