భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్థిక్ పాండ్యా. ఒకవైపు ఫాస్ట్ బౌలింగ్ తో అటు ప్రత్యర్ధులను  భయపెడుతూనే.. మరోవైపు బ్యాటింగ్ లో కూడా అదరగొడుతూ ఉంటాడు ఈ స్టార్ ప్లేయర్. ఏకంగా పిట్ట కొంచెం కూతగనం అనే రీతిలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఉంటుంది అని చెప్పాలి. భారీగా షాట్లు బాదుతూ హార్దిక్ పాండ్యా స్కోర్ బోర్డును సైతం పరుగులు పెట్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అలాంటి హార్దిక్ పాండ్యా ఇటీవల వరల్డ్ కప్ లో కూడా ఫుల్ ఫామ్ లో కనిపించాడు. కానీ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే.


 చీలమండ గాయం కావడంతో నొప్పితో విలవిలలాడిపోయిన హార్దిక్ పాండ్యా చివరికి మైదానం వీడి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత మ్యాచ్లలో అసలు అందుబాటులో లేకుండా పోయాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్ కప్ లోని మిగతా మ్యాచ్లను ఆడలేడు అన్న విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ స్టార్ ఆల్ రౌండర్ లేకుండానే భారత జట్టు అన్ని మ్యాచ్లు ఆడేసింది. అయితే ఇక వరల్డ్ కప్ కి దూరమైనప్పటికీ ఆస్ట్రేలియా తో జరిగే టి20 సిరీస్ నాటికి హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు.


 కానీ కేవలం ఆస్ట్రేలియా తో జరగబోయే టి20 సిరీస్ మాత్రమే కాదు.. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్ కి కూడా హార్దిక్ పాండ్యా దూరంగా ఉంటాడు అంటూ బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం 2024 ఐపీఎల్ తోనే ఆల్ రౌండర్ హార్దిక్  క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు జాతీయ జట్టు తరఫున మ్యాచ్ లకు దూరం కాబోతున్నాడట. అప్పటిలోపు పూర్తి ఫిట్నెస్  సాధిస్తాడని ఇక మేనేజ్మెంట్ భావిస్తుంది. కాగా అతను త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: