వాస్తవానికి క్రిస్ గేల్ వెస్టిండీస్ క్రికెటర్. కానీ అతనికి వెస్టిండీస్ లో ఉన్న అభిమానుల కంటే ఇండియాలో ఉన్న అభిమానులే ఎక్కువ. అతని ఆట తీరని చూసి ఫీదా అయిన ప్రేక్షకులు కోట్లలోనే ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే క్రిస్ గేల్ బ్యాటింగ్ లో సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. నిలబడిన చోటు నుంచే ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండా భారీ సిక్సర్లు కొట్టగల సత్తా అతని సొంతం. ఇక అతని విధ్వంసకర ఆటతీరుతో ఎన్నోసార్లు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు క్రిస్ గేల్.
ఇక ప్రస్తుతం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియా వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడుతున్నాడు. గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒకప్పటి బ్యాటింగ్ పదును చూడటం కష్టమే. ఏం ఆడుతాడులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఏకంగా వీర బాదుడు బాదాడు. ప్రత్యర్థి బౌలర్లను భయపెడుతున్నాడు. ఇటీవలే బిల్వారా కింగ్స్ vs గుజరాత్ జయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. దీంతో మరోసారి గేల్ ఈ మ్యాచ్ లో వీరబాదుడు బాదేసాడు. బౌలర్ రియాన్ సైట్ బాటమ్ వేసిన బౌన్సర్ను ఆఫ్ సైడ్ మీదుగా ఆడటానికి ప్రయత్నించాడు. అతని షాట్ పవర్ కు ఏకంగా బ్యాట్ హ్యాండిల్ సైతం విరిగిపోయింది. దీంతో ఇది చూసి ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం షాక్ అయ్యారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో 27 బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు గేల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి