ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్న హార్దిక్ పాండ్యా.. తన ఆటతీరుతో అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక కెప్టెన్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. తాను కెప్టెన్సీ చేపట్టిన మొదటి సీజన్లోనే ఏకంగా గుజరాత్ జట్టును టైటిల్ విజేతగా నిలిపిన హార్థిక్ పాండ్యా.. ఇక రెండవ సీజన్లోనూ గుజరాత్ ను ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. అయితే ఇలా గుజరాత్ జట్టుకు సర్వం తానై నడిపిస్తున్న హార్దిక్ పాండ్య.. మళ్లీ తన పాత టీమ్ అయిన ముంబైలోకి వచ్చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.
అయితే ఇలా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో చేరబోతున్నాడు అనే వార్తలు నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ హార్దిక్ ముంబై జట్టులోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియా కు కెప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మ ఇక ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతలను హార్థిక్ పాండ్యాకు అప్పగించే అవకాశం ఉంది. ఇది జట్టుకు ఎంతో లాభదాయకం అంటూ ఎబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే ఇండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఇక తన కెప్టెన్సీ ఒత్తిడిని తగ్గించేందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వదులుకొని హార్దిక్ చేతికి ఆ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయ్. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి