అయితే ఇక ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ సరిగ్గా సరిపోయే రీతిలో అతని ప్రదర్శన సాగింది. ఏకంగా వచ్చిన తొలి మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత అన్ని మ్యాచ్లలోనూ అదే తరహా ప్రదర్శన చేశాడు. దీంతో షమీ చేతికి బంతి వచ్చింది అంటే చాలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు వణికి పోయే విధంగా అతను బంతులు సందించాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్లలో విజయాలు సాధించింది అంటే షమి కూడా దానికి ఒక కారణమే.
అయితే గతం లో ఎన్నో ఫిట్నెస్ సమస్యల తో టీమిండియా లో చోటు కోల్పోయిన షమీ.. తర్వాత తన ఫిట్నెస్ను నిరూపించుకుని భారత జట్టు లోకి వచ్చి అదరగొడుతున్నాడు. అయితే ఇటీవల తన ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో తాను స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అంటూ షమీ చెప్పుకొచ్చాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్సైజ్ లో ఏకంగా 750 కేజీల వరకు ఎత్తగలను అంటూ తెలిపాడు. మరే క్రికెటర్ ఇంత బరువు మోయలేరని చెప్పుకొచ్చాడు. ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు ఇష్టం ఉండదని షమీ తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి