ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఇక ఇప్పుడు మాజీ కెప్టెన్ గా మారిపోయాడు. ఎందుకంటే ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ విషయంలో కాస్తయినా గౌరవం ఇవ్వలేకపోయింది ముంబై ఇండియన్స్. ఏకంగా అర్ధాంతరంగా అతనికి కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేతిలో కెప్టెన్సీ బాధ్యతలు పెట్టింది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం.



 ఈ క్రమంలోనే ఆ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం పై ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను మార్చడం ఏంటి అని అందరూ ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు. ఏ టీం అయినా సరే సక్సెస్ఫుల్ కెప్టెన్ తమ జట్టుకు సారధిగా ఉండాలి అనుకుంటుంది. కానీ ఇలా ఐదుసార్లు టైటిల్ అందించి సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రోహిత్ లాంటి కెప్టెన్ ని తొలగించడం ఏంటి అని ఇక సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక కెప్టెన్సీ నుంచి తొలగించిన నేపద్యంలో రోహిత్ అటు ముంబై ఇండియన్స్ లోనే ఉంటాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.


 అయితే అతను వేరే జట్టులోకి వస్తే కళ్ళకు అద్దుకొని.. మరి తీసుకోవడానికి ఇతర ఫ్రాంచైజీలు  సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ముంబై ఇండియన్స్ తో రోహిత్ శర్మ బంధం రాబోయే సీజన్తో ముగియనుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయ్. 2025లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అప్పుడు ఒక్కో జట్టు ముగ్గురు స్వదేశీ ఒక విదేశీ ప్లేయర్ను మాత్రమే అంటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ హార్దిక్ సూర్య కుమార్ యాదవ్ బుమ్రాలను జట్టు రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ముంబైకి తప్ప మరో జట్టుకు ఆడను అనే నిర్ణయాన్ని రోహిత్ మార్చుకుంటే ఇక అతన్నీ కొనుగోలు చేసేందుకు ఎన్నో ఫ్రాంచైజీలు ఎగబడతాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: