త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా దేవర. ఏకంగా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ.. ఇక ఈ సినిమా చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఈ మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తూ ఉన్నాడు.


 ఇక ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మా జాన్వి కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తుంది. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయి అన్నది గత కొంతకాలం నుంచి వినిపిస్తున్న మాట. కాక ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జనవరి మొదటి వారంలో జరిగే షెడ్యూల్లో ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు అనేది తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ అయిన పీటర్ హెయిన్స్ ను పిలిపించారట.



 గోవాలో సముద్రం ఒడ్డున స్పెషల్ సెట్స్ లో ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే క్లైమాక్స్ లో ప్రేక్షకులు అందరిని కూడా అబ్బురుపరిచే విధంగా ఒక నైట్ ఎఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట. ఇక ఈ ఫైట్ సీన్ ఏకంగా సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అని టాక్. ఇక క్లైమాక్స్ సీన్  అరాచకం అనే రేంజ్ లో ఉంటుందని ఒక టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇక ఈ మూవీ లో ఎమోషన్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా సినిమాకు ప్రధాన బలంగా తెరకెక్కుతుందట. కాగా గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: