అయితే ఒక సీజన్లో అన్ సొల్డ్ మిగిలిపోయిన ప్లేయర్లను.. అటు ఆ తర్వాత సీజన్లో మాత్రం భారీ ధర వెచ్చించి ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు.. ఇక ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇక అందరూ ఊహించినట్లుగానే వేలంలో ఫ్రాంచైజీలు అన్ని అటు వరల్డ్ కప్ లో రాణించిన ప్లేయర్లకి పెద్దపీటవేసాయి. వారిని దక్కించుకునేందుకు ఎంత మొత్తంలో చెల్లించేందుకు అయిన సిద్ధమయ్యాయి అని చెప్పాలి..
అయితే గతంలో ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఒక ప్లేయర్ ఇక ఇప్పుడు రికార్డు స్థాయి ధర పలికాడు. ఇటీవలే ముగిసిన వండే వరల్డ్ కప్ టోర్నీలో అదరగొట్టాడు న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్. ఇక ఇటీవల రికార్డు ధర పలికాడు. ఏకంగా 14 కోట్ల రూపాయలు వెచ్చించి చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. అయితే గత ఐపీఎల్ వేలంలో కోటి రూపాయల బేస్ ప్రైస్ తో పాల్గొన్న అతన్ని కొనుగోలు చేసేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. ఇక అతను ఏడాదిగా బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొడుతూ ఉండడంతో.. ఇక ఇప్పుడు ఫ్రాంచైజీలు అతన్ని దక్కించుకునేందుకు పోటీ పడగ చివరికి చెన్నై 14 కోట్ల రూపాయలకు అతని దక్కించుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి