ప్రస్తుతం జింబాబ్వే జట్టుకు సికిందర్ రాజా కెప్టెన్ గా ఉండగా అతను ఒక్కడు తప్ప ఇక జట్టులోని మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా చెప్పుకుదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ఇక చిన్న చిన్న టీమ్స్ చేతుల్లో సైతం జింబాబ్వే టీం అత్యంత దారుణంగా ఓడిపోతూ ఉండడంతో ఇక ఆ జట్టు ఆట తీరూపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఓటములకు బాధ్యత వహిస్తూ ఇటీవల ఆ జట్టు హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. జింబాబ్వే కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరికి అతను కోచ్గా తప్పుకున్నాడు.
అయితే ఇక ఇప్పుడు జింబాబ్వే టీం గురించి మరో సంచలన వార్త తెరమీదికి వచ్చింది. ఏకంగా నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నారు అనే కారణంతో జింబాబ్వే టీం లోని ఇద్దరు క్రికెటర్ల పై ఆ దేశ క్రికెట్ బోర్డు బ్యాన్ చేసింది. వెస్లీ మెద, బ్రాండెన్ మౌత్ డొపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది ఏకంగా కొక్కైన్ లాంటి డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ జరిపిన ఆ దేశ క్రికెట్ బోర్డు ఇక డొపింగ్ నిజమే అని తేలడంతో చివరికి ఇద్దరు ఆటగాళ్లపై నిషేధం విధించింది. దీంతో ఇద్దరు ప్లేయర్లు ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలు లేదు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి