ఇటీవల కాలంలో  రెండు మూడు మ్యాచ్లలో ఎవరైనా ఆటగాడు విఫలం అయ్యాడు అంటే చాలు ఇక అతన్ని సెలెక్టర్లు నిర్మొహమాటంగా పక్కన పెట్టేయడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మని కూడా ఇలాగే పక్కన పెట్టారు. మొన్న సౌత్ ఆఫ్రికా పర్యటనలో అతనికి ఛాన్సులు వచ్చినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతని పక్కనే పెట్టేశారు సెలెక్టర్లు. అయితే ఇలా ఫామ్ లో లేడు అని పక్కన పెట్టిన తిలక్ వర్మ ఇక ఇప్పుడు రంజీ ట్రోఫీలో మాత్రం అదరగొట్టేస్తూ ఉన్నాడు. ఏకంగా వరుసగా సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి.


 ఇటీవల సిక్కింతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తరఫున నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ.. 111 బంతుల్లో ఏకంగా ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో 13 పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఇక ఈ రంజీ ఎడిషన్ లో హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న తిలక్ వర్మ కు ఇది రెండో సెంచరీ అని చెప్పాలి. అతనితోపాటు తన్మయ్ అగర్వాల్ కూడా హైదరాబాద్ తరఫున 137 పరుగులు చేసి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. అంతకుముందు నాగాలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ లో తిలక్ వర్మ 100 పరుగులు సాధించి సెంచరీ చేశాడు.


 ఇక అంతలోనే ఆఫ్గనిస్తాన్తో జరిగిన టి20 సిరీస్ లో ఇక జట్టులో తిలక్ వర్మ ఎంపికయ్యాడు. దీంతో ఇక హైదరాబాద్ తరపున రెండో మ్యాచ్ ఆడలేకపోయాడు. ఇక ఇటీవల సిక్కింతో జరిగిన మూడో మ్యాచ్లో మరోసారి సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో అతని ప్రదర్శన చూసిన తర్వాత సెలెక్టర్లు అతనికి ఇక టెస్ట్ సిరీస్ లో కూడా వరుస అవకాశాలు ఇచ్చి తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ లో రాణించడం ద్వారా తిలక్ వర్మ సెలెక్టర్ల దృష్టిలో పడి టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: