టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న ప్లేయర్లు గాయాల బారిన పడటం చూస్తూ ఉంటాం. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు కెరియర్ లో గాయం బారిన పడి జట్టుకు దూరమైంది చాలా తక్కువ. ఆ రేంజ్ లో అతను ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం కోహ్లీ అటు భారత జట్టుకు సరిగా అందుబాటులో ఉండడం లేదు.


 అతనికి ఎలాంటి గాయం కాలేదు. కానీ వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు అన్న విషయం బిసిసీఐ తెలిపింది. అయితే ఇలా వ్యక్తిగత కారణాలు ఏంటి అనే విషయం తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. టీమిండియాకు దూరంగా ఉండిమరి కుటుంబంతో గడపాల్సిన అంత ముఖ్యమైన క్షణాలు ఏమున్నాయి అనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ స్నేహితుడు ఏ బి డివిలియర్స్ ఏకంగా కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వైరల్గా మారిపోయాయి.


 అయితే ఇలా ఇక డెలివరీ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలి అని ఆలోచనతోనే కోహ్లీ సెలవులు తీసుకున్నాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఏబి డివిలియర్స్ చెప్పిన మాటతో అటు విరుష్క ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇలా కోహ్లీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ చెప్పిన మాట విషయంలో ఏ బి డి మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు. తను తప్పుడు సమాచారం అందించాను అంటూ ఒప్పుకున్నాడు  కోహ్లీ తండ్రి కావడం లేదని.. అతను ప్రస్తుతం ఎందుకు లీవ్స్ తీసుకున్నాడు అనే విషయంపై ఎవరికి సమాచారం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఫాన్స్ మళ్లీ కన్ఫ్యూజన్లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd