క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ ఆట తీరుతో కేవలం ఒక్క దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా ఇక క్రీడా ప్రపంచంలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇండియాలో క్రికెట్ కి మరింత ఎక్కువ క్రేజ్ ఉంది. కాబట్టి ఇక ఆటగాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా సరే తెలుసుకోవడానికి కోట్లాదిమంది ప్రేక్షకులు ఎప్పుడు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియా యుగంలో ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఇక తమ అభిమాన హీరో హీరోయిన్లు ఎవరు అన్న విషయం కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే భారత జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ కూడా తన ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే టాలీవుడ్ లోని ఇద్దరు బడా హీరోల పేర్లు చెప్పడం గమనార్హం. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అదేంటి ఎక్కువ మటుకు బాలీవుడ్ హీరోలను ఇష్టపడతారు కదా.. కానీ మహమ్మద్ షమీ మన తెలుగు హీరోలను ఇష్టపడుతున్నాడా అని అనుకుంటున్నారు కదా.. ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి దేశం మొత్తం దద్దరిల్లిన నేపథ్యంలో ఇక ఎంతోమంది తెలుగు హీరోలను ఆరాధించడం మొదలు పెడుతూ ఉన్నారు. ఇక ఇందులో టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీ కూడా చేరిపోయాడు. తనకు నచ్చిన సౌత్ ఇండియా యాక్టర్ ల గురించి చెప్పుకొచ్చాడు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన మహమ్మద్ షమి.. సౌత్ ఇండియా సినిమాలు చూస్తానని ఇక్కడ సినిమాలు తనకు ఎంతగానో నచ్చుతాయి అంటూ తెలిపాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫేవరెట్ హీరోలు అంటూ షమి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: