టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి అటు క్రికెట్ లవర్స్ కి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. కేవలం క్రికెట్ లవర్స్ కి మాత్రమే క్రీడ ప్రపంచం మొత్తానికి కూడా అతను సుపరిచితుడు అయితే. క్రీడా ప్రపంచానికి రారాజు అంటూ ఉంటారు కదా.. ఇక నేటి జనరేషన్ క్రికెట్ కి అతనే రారాజు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరిలాగే ఒకసాదా సీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లీ ఇక నేటి జనరేషన్ కి అతన్ని మించిన లెజెండ్ మరొకరు లేరు అనే విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ రేంజ్ లోనే ఫాలోయింగ్ సంపాదించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఎప్పుడైనా ఏదైనా పోస్ట్ పెట్టాడు అంటే చాలు ఇక ఆ పోస్టు రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. ఇక ఇటీవల విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ ఇలాగే ఒక రికార్డు సృష్టించింది అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి టీమిండియా కు దూరంగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. అతను ఎందుకు ఇలా వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు అనే విషయంపై చర్చ కూడా జరుగుతుంది. అయితే కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడు అని వార్తలు తెరమీదకి వచ్చిన అదంతా అవాస్తవం అనుకున్నారు అందరూ. కానీ ఇటీవల ఇదే నిజం అనే విషయం తేలిపోయింది. పండంటి మగ బిడ్డకు విరుష్క జంట జన్మనిచ్చింది.


 ఈ క్రమంలోనే రెండోసారి తండ్రి అయినట్లు అభిమానులు అందరితో కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో  విరాట్ కోహ్లీ చేసిన పోస్ట్ కి ఏకంగా గంట వ్యవధి లోనే ఐదు మిలియన్ల లైకులు వచ్చాయి అని చెప్పాలి. దీంతో ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువ లైక్స్ అందుకున్న పోస్ట్ గా కోహ్లీ పెట్టిన పోస్ట్ రికార్డుల్లోకి ఎక్కింది. కాగా విరాట్ కోహ్లీ రెండవ సంతానానికి అకాయ్ అని నామకరణం చేశారు. అయితే ఇక ఫ్యూచర్ కోహ్లీ ఈ లోకంలోకి రావడంతో ప్రస్తుతం విరాట్ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: