ఇండియాలో క్రికెట్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా స్టార్ క్రికెటర్లను దైవంలాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనె జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన క్రికెటర్లను కలవాలని తెగ ఆశపడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటి కోరికను తీర్చుకోవడానికి విన్యాసాలు చేయడానికి కూడా సిద్ధపడిపోతూ ఉంటారు. ఇక ఇండియాలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏకంగా భారత ప్లేయర్లను కలవడానికి ఎంతో మంది ప్రేక్షకులు అటు సెక్యూరిటీని దాటుకొని మైదానంలోకి దూసుకు రావడం లాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇలా మైదానంలోకి దూసుకు వచ్చిన కొంతమంది ఆడియన్స్ పై గ్రౌండ్ నిర్వాహకులు సీరియస్ గా చర్యలు తీసుకున్న ఘటనలు కూడా వెలుగు చూసాయ్ అనే విషయం తెలిసిందే. ఇ
కపోతే ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ లో జరుగుతున్న స్టేడియాలు అటు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా మ్యాచులు జరుగుతున్న సమయంలో కొంతమంది ప్రేక్షకులు తమకు నచ్చిన వ్యాఖ్యాన్ని ఏదో ఒక పోస్టర్ పై రాశి దానిని ఇక మైదానంలో ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి చేసి తమ అభిమాన క్రికెటర్ల దృష్టిని ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు.


 గతంలో ఆర్సిబి టైటిల్ గెలిస్తేనే తాను పెళ్లి చేసుకుంటాను అని రాసి ఒక ఫ్లకార్డును అభిమాని ప్రదర్శించగా వైరల్ గా మారింది. ఇక ఇటీవల అండర్సన్ రిటైర్ అయిన తర్వాతే తాను చదవడం ప్రారంభిస్తాను అంటూ మరో అభిమాని ప్లకార్డును  ప్రదర్శించాడు.  ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇలాంటి ఫ్లకార్డ్ ఒకటి వైరల్ గా మారిపోయింది   ఆర్ సి బి ఆల్ రౌండర్ శ్రేయంక పాటిల్ కు ఒక అభిమాని ఏకంగా ప్రపోజ్ చేశాడు. గుజరాత్ జేయుంట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమాని ప్రేక్షకుల గ్యాలరీ నుంచి.. విల్ యు మ్యారి మీ  శ్రేయాంక పాటిల్ అని రాసి ఉన్న పోస్టర్ను ప్రదర్శించాడు. ఇక పోస్టర్లో లవ్ సింబల్ తో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. ఇది చూసిన ఆర్సిబి ప్లేయర్లు డగ్ అవుట్ లో నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl