మన దేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య క్రికెటర్లకు సంబంధించి ఏ చిన్న విషయం తెరమిదికి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు కూడా క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలం నుంచి టీమిండియా సీనియర్ ప్లేయర్ మహమ్మద్ షమి ఇలాగే వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి అదరగొట్టాడు. ఇక వరల్డ్ కప్ సమయంలోనే గాయం బారిన పడిన ఈ స్టార్ ప్లేయర్ ఇప్పటివరకు కోలుకోలేదు.


 ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని అభిమానులు షమి పునరాగమనం కోసం ఎదురు చూడటం తప్ప.. ఇక అతను గాయం నుంచి ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదు  చివరికి ఐపీఎల్ టోర్నీ కి కూడా దూరం అయిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇలా మొన్నటి వరకు గాయం నుంచి కోలుకుంటాడా లేదా అనే విషయంపై వార్తల్లో హాట్ టాపిక్ గా మారగా.. ఇక ఇప్పుడు మరో పర్సనల్ విషయంలో మహమ్మద్ షమీ వార్తల్లో నిలిచాడు. ఏకంగా విడాకులు ఇచ్చి షమీ నుంచి వేరుపడిన అతని భార్య స్టార్ ప్లేయర్ మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది.



 ఈ క్రమంలోనే క్రికెటర్ శమీ మాజీ భార్య హసిన్ జహాన్ చేసిన ఆరోపణలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. శమీ నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. యూపీ పోలీసుల సహాయంతో అతడు ఈ పథకం రచిస్తున్నాడు అంటూ హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమి, హసీన్ జహాన్ తో 2014లో పెళ్లి జరిగింది. 2015లో వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఈ క్రమంలోనే 2018లో షమి అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ అతనిపై భార్య కేసు పెట్టింది. ఇక అప్పటి నుంచి మహమ్మద్ షమీ భార్యతో దూరంగా తల్లితో కలిసి ఉంటున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: