మార్చ్ 22వ తేదీన ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా చివరి బంతి వరకు ఉత్కంఠ గా సాగుతూ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టగలుగుతుంది. ఈ క్రమంలోనే అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ అంటే ఇదే అని ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగా చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా అలాగే బరిలోకి దిగి అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించింది.


 అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇలా వరుసగా మ్యాచ్ లలో విజయం సాధిస్తున్న.. అటు ఆ జట్టు అభిమానులు మాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే ఇక అందరూ ఎదురు చూస్తున్న ధోని ఆట మాత్రం చూడలేకపోతున్నారు. ధోని ఇప్పటికే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అందరూ కూడా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఇక ఎప్పుడూ వచ్చే ఆరవ స్థానంలో కాకుండా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చి ధోని తన బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరిస్తాడు అని అందరూ అనుకున్నారు.


 కానీ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు జరిగిన సోనీ బ్యాటింగ్ చేయడానికి మాత్రం రాలేదు. దీంతో ధోని బ్యాటింగ్ చేయడానికి వస్తాడేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతూ వస్తుంది. ఇక ఇలాంటి నిరాశ కొన్ని కొన్ని సార్లు అసంతృప్తికి కూడా కారణం అవుతుంది. దీంతో కొంతమంది అభిమానులు ఇలా బ్యాటింగ్ చేయడానికి రాలేనప్పుడు రిటైర్ అయిపో  అంటూ కామెంట్ చేస్తున్నారు . ధోని బ్యాటింగ్ కి వస్తావేమో అని ఆశగా ఎదురు చూడటం.. ఇక మా వల్ల కాదు  అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: