భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. టీమ్ ఇండియాలో ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ కావడంతో చాలా సంవత్సరాలుగా ఇండియాకు కోచ్ గా వ్యవహరిస్తూ ద్రావిడ్ తన మెలుకువలతో ఇండియాకు ఎన్నో విజయాలను అందేలా చూశాడుఎం ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే T 20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్లేయర్స్ ని కూడా బీ సీ సీ ఐ సెలెక్ట్ చేసింది.

ఇక ఐ పీ ఎల్ పూర్తి కాగానే టీమిండియా టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లపై దృష్టి పెట్టనుంది. ఇది ఇలా ఉంటే టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లతో రాహుల్ ద్రావిడ్ టీమ్ ఇండియాకు కోచ్ గా వ్యవహరించే పదవీ కాలం పూర్తి కానుంది. దానితో ప్రస్తుతం బీ సీ సీ ఐ కొత్త కోచ్ కోసం దరఖాస్తులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీ సీ సీ ఐ కి కొన్ని దరఖాస్తులు రాగా అందులో ఒక దానిని ఆల్మోస్ట్ ఫైనల్ చేసే ఉద్దేశంలో బోర్డు ఉన్నట్టు తెలుస్తుంది.

న్యూజిలాండ్ టీమ్ లో ఎన్నో అద్భుతమైన మ్యాచ్ లను ఆడి తన జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించి గొప్ప ఆటగాడిగా గుర్తింపును తెచ్చుకున్న క్రికెట్ దిగ్గజం ప్రస్తుతం ఐ పీ ఎల్ జట్టు లో చెన్నై సూపర్ కింగ్స్ కి కోచ్ గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ తో బోర్డు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు ఆల్మోస్ట్ ఇతన్నే కన్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఉన్న కోచ్ పదవీ కాలం మే 27 వ తేదీతో పూర్తి కానుంది. దానితో బి సి సి ఐ సభ్యులు కొత్త కోచ్ ను త్వరగా నియమించడానికి చాలా స్పీడ్ గా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: