
-
Andhra Pradesh
-
Bharatiya Janata Party
-
CBN
-
central government
-
Chintamaneni Prabhakar
-
Daggubati Venkateswara Rao
-
Government
-
Janasena
-
Minister
-
MP
-
Narendra Modi
-
News
-
Nitish Kumar
-
Parakala Prabhakar
-
Parliment
-
prabhakar
-
Prime Minister
-
Ram Mohan Naidu Kinjarapu
-
Telangana
-
Telugu
-
Telugu Desam Party
-
Thota Chandrasekhar
-
Venkatesh
అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇవాళ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో... ఏకంగా 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిత్రపక్షలకు ఐదు నుంచి 8 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి... ఎక్కువ సంఖ్యలో ఈసారి మంత్రి పదవులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మోడీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకు రావడానికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీకి... మూడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇందులో కింజారపు రామ్మోహన్ నాయుడు మొదటి స్థానంలో ఉండనున్నారు. ఈయనకు కేంద్ర మంత్రిత్వ శాఖ నేరుగా రానుంది. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమసాని చంద్రశేఖర్ లకు సహాయ కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయట.
ఈ మేరకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాకుండా దగ్గుబాటి పురందరేశ్వరికి... బిజెపి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమైందట. అటు జనసేన నుంచి వల్లభనేని బాలశౌరికి కేంద్ర కేబినెట్ పదవి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తంగా ఏపీ నుంచి అయిదుగురు కేంద్ర మంత్రులు కాబోతున్నారన్నమాట. అటు ఎన్డీఏ కూటమికి అండగా నిలిచిన నితీష్ కుమార్ పార్టీకి రెండు పదవులు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది.
జెడ్ యు నుంచి లాలాన్ సింగ్, అలాగే సంజయ్ లకు కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయట. ఇటు తెలంగాణ నుంచి ఒకే ఒక్కరికి కేంద్ర మంత్రి హోదా రాబోతుందట. అలాగే మరొకరికి... కేంద్ర సహాయ మంత్రి శాఖ రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. తెలంగాణలో 8 ఎంపీలు ఉన్నప్పటికీ... మోడీ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. చంద్రబాబు కీ రోల్ ఉన్న నేపథ్యంలో... పదవులన్నీ ఏపీకి ఇచ్చేందుకు మోడీ నిర్ణయం తీసుకున్నారట. దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది.