సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కప్పు గెలవబోతుందా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు కేవలం బౌలింగ్ మీద మాత్రమే ఆధారపడుతూ ఐపీఎల్ లో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక బ్యాటింగ్లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసింది  ఏకంగా మహా మహా టీమ్స్ కి సైతం తమ బ్యాటింగ్ తో ముచ్చమటలు పట్టించింది అని చెప్పాలి.


 అలాంటి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అటు ఐపీఎల్ లోని ప్లే ఆఫ్ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఇక రెండవ స్థానంలో కొనసాగిన హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించి విజయం సాధించి నేరుగా ఫైనల్ కు వెళుతుంది అనుకున్నా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శన చేసి చివరికి నిరాశపరిచింది అని చెప్పాలి. దీంతో ఇలా మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో ఓడిపోయిన సన్రైజర్స్ జట్టు ఇక రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించి సత్తా చాటిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. దీంతో ఇక ఈ మ్యాచ్లో సన్రైజర్స్ టీం ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం పైన అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇక ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ పవర్ హిట్టింగ్ ఓపెనింగ్ జోడి ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మలు బాగా ఆడితే గెలుపు హైదరాబాద్ జడ్డుదే అని అందరూ అనుకుంటున్నారు. ఈ సీజన్లో ట్రావిస్ హెడ్ 543, అభిషేక్ శర్మ 470 పరుగులు చేశారు. బౌల్ట్, అశ్విన్, చాహల్ లాంటి ప్రమాదకరమైన బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోర్ చేయాలంటే ఈ జోడి రాణించక తప్పదు. వీరితోపాటు క్లాసేన్ కూడా మరో ఆపద్బాంధవుడుగా మారాలి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ నట్టు లతో కూడిన బౌలింగ్ విభాగం కూడా ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా రేపు చపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: