అయితే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు దూరం అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ కాజల్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఇక ఇప్పుడు కాజల్ ప్రధాన పాత్రలో నటించినా సత్యభామ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇక ఈ టాలీవుడ్ చందమామ బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ హీరోయిన్.
ఈ క్రమంలోనే ఐపీఎల్ లో తెలుగు టీం అయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అన్న విషయాన్ని ఇటీవల కాజల్ తెలిపింది. సన్రైజర్స్ హైదరాబాద్ లో తన ఫేవరెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ హీరోయిన్ కాజల్ తెలిపింది. తనకు ఇష్టమైన ఐపీఎల్ టీం సన్రైజర్స్ అంటూ ఇక సత్యభామ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఫేవరెట్ ఫిలిం సెంట్ ఆఫ్ ఉమెన్ అంటూ తెలిపింది. ఆల్ టైం ఫేవరెట్ కోస్టార్ మెగాస్టార్ చిరంజీవి అంటూ తెలిపిన కాజల్. ఇక ఓవరాల్ క్రికెట్లో చూసుకుంటే ధోని తన ఫేవరెట్ క్రికెటర్ అంటూ చెప్పకు వచ్చింది.