2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్పు గెలవబోతుంది అని అటు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతో బలంగా నమ్మారు. ఎందుకంటే మునుపెన్నడు లేనివిధంగా ఈసారి హైదరాబాద్ జట్టు పటిష్టంగా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లీగ్ దశలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్రత్యర్థులకు ముచ్చటలు పట్టిస్తుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్లుగా ఉన్న రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టింది.


 ఈ క్రమంలోనే ఇక అద్భుతమైన ఆటతీరుతో ప్లే ఆప్స్ లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ప్లే ఆఫ్ లో  అడుగు పెట్టిన తర్వాత కూడా సన్రైజర్స్ అదరగొడుతుంది అనుకున్నప్పటికీ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో కొలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది  దీంతో ఇక నేడు మరో కీలకమైన మ్యాచ్ ఆడబోతుంది. ఎలిమినేటర్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడబోతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలిచి ఇక ఫైనల్ కు దూసుకుపోతుంది అనే అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు  ఇలాంటి సమయంలో ఒక తెలుగు ప్లేయర్ మాత్రం సన్రైజర్స్ కి అంత సీన్ లేదు అంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.



 చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ పై గెలవడం సన్రైజర్స్ కు కష్టమే అంటూ తెలుగు ప్లేయర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ తో పోల్చి చూస్తే రాజస్థాన్ బౌలర్లకు ఆ పిచ్ బాగా సెట్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్ గా కనిపిస్తుంది  అదేమి హైదరాబాద్ వికెట్ కాదు.. సన్రైజర్స్ ఆటగాళ్లు మెదడు ఉపయోగించి ఆచితూచి ఆడాలి. అక్కడ వికెట్లు తీయలేరూ కాబట్టి.. బ్యాటింగ్ తోనే ఫైచేయి సాధించాలి అంటూ అంబటి రాయుడు సూచించాడు. అయితే ఒక తెలుగు ప్లేయర్ అయ్యుండి తెలుగు టీం కి సపోర్ట్ చేయకుండా గెలవడం కష్టం అంటూ కామెంట్ చేయడం ఏంటి అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl