అయితే ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసినప్పుడు థర్డ్ అంపైర్ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అన్ని యాంగిల్స్ లో అక్కడ జరిగిన ఘటనను పరీక్షించిన తర్వాత ఇక ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయం తప్ప ఒప్ప అన్న విషయాన్ని ప్రకటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేవలం బిఆర్ఎస్ తీసుకోవడం విషయంలో ఒక జట్టుకి కేవలం పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఈ క్రమంలోనే సరైన సమయంలో మాత్రమే ఈ బిఆర్ఎస్ ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే జట్టుకు అది మైనస్ గా మారుతుంది.
అయితే ఇలా రివ్యూ తీసుకోవడం విషయం లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలి ఫోప్ పరువు పోగొట్టుకున్నాడు. రివ్యూల విషయంలో ఆయన కచ్చితంగా వ్యవహరించలేక చివరికి చివరికి నవ్వుల పాలవుతున్నాడు. ఇప్పటి వరకు టెస్ట్ ఫార్మాట్లో ఆయన ఒక్క రివ్యూ కూడా నెగ్గలేదు. ఇప్పటి వరకు కెప్టెన్ గా అతను పది రివ్యూలు తీసుకోగా.. అన్నిసార్లు కూడా రివ్యూలలో అతనికి ప్రతికూలం గానే తీర్పు వచ్చింది. వరల్డ్ క్రికెట్లో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా టెస్ట్ ఫార్మాట్లో ఎన్నిసార్లు వరుసగా రివ్యూలు ఫెయిల్ అవ్వలేదు. దీంతో ఓలి ఫోప్ రివ్యూల విషయం లో ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్.