ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకపోవడం ఇక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వెరసి ఆ దేశ క్రికెట్ ఏకంగా కోలుకోలేని స్థితిలోకి పతనం అవుతోంది. అయితే గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ విషయంలో కూడా అయోమయం నెలకొంది. ఏ సమయంలో ఎవరు కెప్టెన్సీ చేపడతారు అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఒకప్పుడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన బాబర్ ఆ తర్వాత విమర్శలు రావడంతో చివరికి సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎవరు కెప్టెన్ గా సక్సెస్ కాకపోవడంతో 2024 టి20 వరల్డ్ కప్ కి ముందు మళ్ళీ జట్టు కెప్టెన్సీ అందుకున్నాడు.
కానీ జట్టులో ఉన్న ఆటగాళ్ల అందరిని ఒక్కతాటి పైకి నిలబెట్టడంలో సక్సెస్ కాలేకపోయాడు. ఇక వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఎంత దారుణంగా విఫలమైందో అందరికీ తెలిసిందే. దీంతో మళ్ళీ బాబర్ కెప్టెన్సీ పై విమర్శలు వచ్చాయి. కాగా ఇక ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ ప్రమాదంలో పడుతుంది అనుకుంటుండగా ఇప్పుడు మరోసారి షాకింగ్ ఘటన జరిగింది పాకిస్తాన్ టి20, వన్డే కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన బ్యాటింగ్, పర్సనల్ గ్రోత్ పై మరింత దృష్టి పెట్టెందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కెప్టెన్సీ వల్ల వర్క్ లోడ్ పెరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇలా కెప్టెన్లను మారుస్తూ పోతే పాకిస్తాన్ క్రికెట్ ఇంకెప్పుడు బాగుపడుతుంది అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.