టీమ్ ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాజాగా టెస్టులకు సైతం రిటైర్డ్ ప్రకటించడం జరిగింది. దీంతో కొంతమంది అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా వైదొలిగినట్లు తెలుస్తోంది.ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు రోహిత్ ,కోహ్లీ. నిష్క్రమణతో టెస్ట్ క్రికెట్లు ఒక శకం ముగిసింది అంటూ తెలిపారు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆదరణ పొందిన క్రికెటర్ గా పేరు సంపాదించారు.



ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపన్న క్రీడా కారులలో ఒకరుగా కోహ్లీ నిలిచారు. ఈయన ఆస్తి విలువ సుమారుగా 1100 కోట్ల రూపాయలకు ఉంటుందట. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో కోహ్లీ ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్నారు.. దీంతో ప్రతి ఏడాది కూడా కోహ్లీకి 7 కోట్ల రూపాయలు జీతం గా అందిస్తోందట. ప్రతి టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు వన్డే మ్యాచ్ కు 6లక్షల రూపాయలు టి20కి 20 లక్షల రూపాయలు.. అందుకుంటారట. ఇక ఐపీఎల్ లో అయితే పెద్ద మొత్తంలోనే సంపాదిస్తారట విరాట్ కోహ్లీ.


2008 ఏడాది నుంచి ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతూ ఉన్నారు. 2008లో 12 లక్షల రూపాయలు అద్దుకోగా.. 2018 నుంచి 2021 మధ్య 17 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఇప్పుడు 2025 సీజన్ కి 20 కోట్లకు పైగా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీ దగ్గర 7 స్టార్టప్స్ బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే 18 బ్రాండ్లకు ప్రచార కర్తగా కూడా ఉన్నారు. అలా యాడ్స్ ద్వారా ప్రతి ఏడాది 175 కోట్లు సంపాదిస్తున్నారట. ఇక ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ చేస్తే 9 కోట్ల రూపాయలు తీసుకుంటారట. ట్విట్టర్లో రెండు కోట్లు తీసుకుంటున్నారట. ఇవే కాకుండా భారీ స్థాయిలో కూడా ఆస్తులు ఉన్నాయట కోహ్లీకి.. ఇలా సుమారుగా అన్నీ కలుపుకొని 1100 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇక అనుష్క శర్మ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: