ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ జట్లలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ ను చాలా మంది ప్రజలు చిన్న జట్టుగా చూస్తూ ఉంటారు. కానీ ఆఫ్గనిస్తాన్ జట్టులో కొద్ది మంది అద్భుతమైన ప్లేయర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టు నుండి మంచి స్థాయిలోకి చేరింది. ఇకపోతే ఈ జట్టు లోని ఓ ప్లేయర్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఆల్ రౌండర్ గా తాజాగా ఈ జట్టు ప్లేయర్ ఒక అరుదైన రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. ఇంతకు ఆ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఆల్రౌండర్ లలో ఒకరు అయినటువంటి నబి.

తాజాగా ఈయన అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ లలో అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ లలో 2000 పరుగులు చేయడంతో పాటు 100 పైగా వికెట్లను పడగొట్టి 2000 పరుగులు మరియు 100 వికెట్లను పడగొట్టిన ప్లేయర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ టీ 20 ఫార్మేట్ లో నబీ కంటే ముందు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ అయినటువంటి షకిబ్ అల్  హసన్ 129 మ్యాచుల్లో 2551 పరుగులు చేసి 149 వికెట్లు తీసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

యూ ఏ ఈ ట్రై సిరీస్ లో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నబి ఈ రికార్డ్ ను నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో నబి రెండు వికెట్లు తీశాడు. ఇలా ఆఫ్గనిస్తాన్ కి సంబంధించిన ఆటగాడు అయినటువంటి నబి తాజాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లను తీసి అదిరిపోయే రేంజ్ రికార్డ్ ను సొంతం చేసుకుని ప్రపంచం లోనే అంతర్జాతీయ టీ 20 ఫార్మేట్ లో 2000 కి మించిన పరుగులు 100 కు మించిన వికెట్లను తీసి అద్భుతమైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: