అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెట్ రషీద్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ర‌షీద్ ఖాన్ ఆప్గాన్ క్రికెట్ కు స్టార్ కావ‌డంతో ఆయ‌న ఎప్పుడు ఏం చేసినా వార్త‌ల్లోనే నిలుస్తున్నారు. తాజాగా ర‌షీద్ ఓ కార్యక్రమంలో ఓ మహిళతో కనిపించడంతో ర‌క‌ర‌కాల పుకార్లు షికార్లు చేశాయి. రషీద్ ఖాన్ ఇటీవల నెదర్లాండ్స్‌లో ‘ ఖాన్ చారిటీ ఫౌండేషన్ ’ ప్రారంభించాడు. ఆ కార్యక్రమంలో ర‌షీద్ ప‌క్క‌నే ఉన్న ఆ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో రషీద్ ఆ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఒక్క‌టే ఆప్గాన్ తో పాట దుబాయ్ .. ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే రషీద్ ఖాన్ ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చాడు.


ఈ యేడాది ఆగస్టు 2 నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. నేను రెండో పెళ్లి చేసుకున్నా అని తెలిపాడు. తాను ఎంతో ఇష్టంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆమె నా జీవిత భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇటీవల నా భార్యను చారిటీ కార్యక్రమానికి తీసుకెళ్లా. ఇంత చిన్న విషయంపై రకరకాల ఊహాగానాలు రావడం దురదృష్టకరం అని తెలిపాడు. ఇందులో దాచడానికి ఏమీ లేదు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అని రషీద్ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నాడు. 2024 అక్టోబర్‌లో సంప్రదాయం ప్రకారం రషీద్ మొదటి వివాహం జరిగింది. రషీద్ వివాహ వేడకకు అఫ్గాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకముందే వారిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినట్లు సమాచారం.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: