ఫేమస్ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ అయిన HOP ఎలక్ట్రిక్ HOP LEO  హై స్పీడ్ వేరియంట్‌ ని విడుదల చేయడం జరిగింది.HOP ఎలక్ట్రిక్ రిలీజ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1 లక్ష కంటే తక్కువగానే ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీకి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఈ బైక్ ని కొనవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి సూపర్ డిజైన్ కలిగి మంచి అప్డేటెడ్ ఫీచర్స్ ని పొందుతుంది.కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు ఏకంగా 50 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లగలదు.ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయిన కొత్త హోప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 kWh లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉంది. ఇది ఒక ఛార్జ్ తో మాక్సిమం 120 కిమీ రేంజ్ ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 2.95 బిహెచ్‌పి పవర్ ఇంకా 90 ఎన్ఎమ్ టార్క్ ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉండే BLDC హబ్ మోటార్ ఇంకా అలాగే కంట్రోలర్ వంటివి స్కూటర్ ను హ్యాండిల్ చేయడం తేలిక చేస్తాయి.


ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 850 W స్మార్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 2.5 గంటల సమయంలో 0 నుంచి 80 శాతం దాకా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే కాకుండా హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ విభిన్న రైడింగ్ మోడ్స్ ని కూడా పొందుతుంది. ఇందులో ఎకో, పవర్ ఇంకా అలాగే స్పోర్ట్ మోడ్స్ మాత్రమే కాకుండా రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా రైడర్ కి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి.హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి సస్పెన్షన్ సెటప్ ని కూడా పొందుతుంది. ఈ స్కూటర్  ముందు భాగంలో స్ట్రెయిట్ గా ఉండే టెలిస్కోపిక్ ఫోర్క్ ఇంకా అలాగే వెనుక సస్పెన్షన్ హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్ వంటివి కూడా ఉంటాయి. ఇంకా అంతే కాకుండా ఇందులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ముందు, వెనుక బ్రేక్‌లు కాంబి-బ్రేక్ సిస్టమ్ ఇంకా రీజెనరేటివ్ బ్రేకింగ్‌ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: