ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా ఐఫోన్ మొబైల్ ని ఉపయోగించాలని అనుకుంటూ ఉంటారు యూజర్స్. మరి కొంతమంది ఈ బ్రాండ్ నుంచి ఎలాంటి మొబైల్ విడుదలైనా సరే కొనాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా ఐఫోన్ -15 సిరీస్ లాంచ్ కు ముందే పలు ఫీచర్స్ ధర వంటివి రివిల్ అయినట్లుగా తెలుస్తోంది. రాబోయే యాపిల్-15 మొబైల్ సరికొత్త డిజైన్తో అనేక మార్పులు చేయనుంది. లీకైన ఆధారంగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ధర గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


ఐఫోన్-15 మొబైల్ సెప్టెంబర్ లో లాంచ్ కాబోతోంది.. ఐఫోన్ లాంచ్ తో కంపెనీ సరికొత్త డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ తక్కువ ధర కలిగిన మోడల్ గల మొబైలను కూడా తీసుకురాబోతోంది.గతంలో ఐఫోన్ -14 ప్రో మోడల్ గల మొబైల్ లను మాత్రమే పరిమితం చేసింది. ఈ ఐఫోన్ ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్డ్ డిస్ప్లే తో చూడవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా యాపిల్ సరికొత్త డిజైన్ మోడల్ తో రాబోతున్నది. గత కొన్ని ఏళ్లుగా సాధారణమైన మోడల్స్ తోనే డిజైన్ అందిస్తున్న ఐఫోన్ ఈసారి సరికొత్త డిజైన్తో రావాలని ప్లాన్ చేస్తోంది..


ఈసారి ఐఫోన్ 15 కు యూఎస్బీ టైప్ -C పోర్టు ను అందించనుంది. ఈ 5జి గల మొబైల్ వెనుక భాగంలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది.. లీకైన సమాచారం ప్రకారం ఐఫోన్ -15 మొబైల్ ధర రూ.80,000 రూపాయలతో రాబోతోందని సమాచారం. సరికొత్త ఫినిషింగ్ తో పాటు, బ్యాటరీ బ్యాకప్ తో పాటు, స్టైలిష్ డిజైన్తో కూడా రాబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త వెర్షన్ గల మొబైల్ సరికొత్త డిజైన్తో పాటు పలు మార్పులు కూడా ఉండవచ్చట. సరికొత్తగా రాబోతున్న ఈ మొబైల్ పూర్తి వివరాలు స్పష్టత రావాలి అంటే లాంచింగ్ తర్వాతనే వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: