కార్తీక దీపం సీరియ‌ల్‌.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌డం అవ‌స‌రంలేని పేరు. ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటి వరకూ 762 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కార్తీక్ మరియు దీప అనే రెండు పాత్రల మీద నడిచే ఈ సీరియల్ తెలుగులో అత్యంత ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రాబడుతున్న సీరియల్ గా మారింది. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని మహిళా ప్రేక్షకులు దాదాపు ఉండరు. ఈ సీరియల్ భారీ హిట్ అవ్వ‌డానికి కార‌ణం కూడా ఆమె నటనే అని చెప్పాలి.

ఒక మామూలు వంటలక్క కి.. సున్నితమైన డాక్టర్ బాబుకి మధ్యలో వచ్చిన మనస్పర్థలు.. విడిపోయిన ఆ జంటను కలపాలని చూస్తున్న చిన్నారులు.. పెద్దరికంతో కోడల్ని సానుభూతితో అర్థం చేసుకున్న అత్తగారు.. ఎలాగైనా వంటలక్కకి డాక్టర్ బాబుతో విడాకులు ఇప్పించి పెళ్లాడాలనుకుంటున్న మరదలు పిల్ల ఎత్తులు.. ఇదే కార్తికదీపం సీరియ‌ల్‌. అయితే క‌రోనా కార‌ణంగా ఆర్ధిక వ్యవస్థతో పాటుగా టెలివిజన్ రంగంపై కూడా గట్టిగా పడింది. దీనితో ఇప్పటికే పలు ఛానెల్స్ వారు కూడా తమ ధారావాహికలు రిపీట్ ఎపిసోడ్స్ ను టెలికాస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.

అయితే కార్తీక‌దీపం సీరియ‌ల్‌ వీక్షకులకు మాత్రం ఈ సీరియల్ హీరో ఓ సందేశం ఇస్తున్నారు. ఈ సీరియల్ హీరో నిరూపం తన ఇంట్లోనే ఉండి కరొనపై అవగాహన కల్పిస్తూ తమ హాట్ స్టార్ యాప్ ను డౌన్ లోడ్ చేసి అందులో తాము ఇంట్లోనే ఉన్నామన్న “ఎట్ హోమ్” అనే స్టిక్కర్ ను డౌన్లోడ్ చేసి తమకు పంపామన్నారు. అలా పంపిన వాటిలో ఏది బాగుంటే దానిని తమ టీవిలో టెలికాస్ట్ చేస్తామని అంటున్నారు. కాబ‌ట్టి..  మీరు కూడా కనిపించాలి అంటే చ‌క్క‌గా రెడీ అయ్యి హాట్ స్టార్ లో పంపండి. మీ లక్ బాగుంటే మీరు కూడా టీవిలో కనిపించొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: