బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ వీరిద్దరి గురించి చెప్పవలసిన అవసరమే లేదు. జబర్దస్త్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వీళ్ల ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తే చాలు వాళ్లకి పండుగే పండుగ. ఏడేళ్లుగా వీళ్లిద్దరూ మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూనే ఎప్పుడూ ఏదో ఒక అనుబంధంతో ప్రజల్లోనూ వార్తల్లోని కనిపిస్తూ ఉంటారు.

 


ప్రస్తుతం లాక్ డౌన్ అమలుతో జబర్దస్త్ షో ఆపేయడం జరిగింది. దీనితో పాటు అన్ని రకముల షోలు కూడా ముగిసిపోయాయి. ఇక రష్మీ మాత్రం షూటింగ్స్ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. అన్ని విషయాలపై బాగా స్పందిస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీకి ఫాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది.  ఈ బ్యూటీ తాజాగా తన అప్డేట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా నెటిజన్లు చేసిన కామెంట్లకు రిప్లై ఇస్తూ ఉంటుంది. తాజాగా ఒక నెటిజన్ సుధీర్ గురించి అడిగాడు. 

 


ఆస్క్ రష్మీ ప్రొగ్రామ్ లో భాగంగా సుడిగాలి సుధీర్ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటూ ఒక నెటిజన్ అడగగా రష్మి బదులిస్తూ సుడిగాలి సుధీర్తో పనిచేయడం ఒక అద్భుతం అని తెలిపింది. ఇక గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు రావడం జరిగింది కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ తో మాత్రం ఈ బ్యూటీకి సుధీర్ అంటే చాలా అభిమానం అన్న విషయం మాత్రం బాగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: