హేయ్.. ఎవరిని పట్టుకొని ఎం అడుగుతున్నావు? చిన్నారి పెళ్లికూతురు సీరియల్ గుర్తు ఉండదా? మరి చెప్తారు అబ్భా. అని అనుకుంటున్నారు కదా! అవును మరి.. ఈ సీరియల్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టం.. అందుకే ఈ సీరియల్ చివరి భాగం వరుకు ప్రతి ఒక్కరు చూశారు. 

 

అంత ప్రేమ ఈ సీరియల్ అంటే.. స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ అప్పట్లో రాత్రి 7 గంటలకు వచ్చేది.. ఇంకా 7 అయ్యింది అంటే చాలు ఈ సీరియల్ కోసం టీవీ ఆన్ చేసి కూర్చునే వాళ్ళు. అలాంటి ఈ గొప్ప సీరియల్ ఇప్పుడు అయిపోయింది కానీ.. ఈ సీరియల్ ని ఇంతవరుకు మర్చిపోలేదు అంటే నమ్మండి. 

 

ఇంకా ఈ సీరియల్ ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యింది అంటే? ఈ సీరియల్ లో చిన్న వయసులో పెళ్లి అయితే ఆడపిల్లలకు ఎంత నష్టం అని.. పెళ్లి చేసుకున్న అబ్బాయి చిన్న వయసులోనే మరణించడం వల్ల ఆడపిల్లకు జీవితాంతం విధవరాలుగా ఉంచి అమ్మాయి జీవితాన్ని తల్లితండ్రులు ఎలా నాశనం చేస్తారు అనేది ఈ సీరియల్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. 

 

ఇంకా చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న అబ్బాయి ఉన్న.. వయసు పెరిగేకొద్దీ అబ్బాయి ఆలోచనలు ఎలా ఉంటాయి.. చదువుకునే సమయంలో అబ్బాయి ఎలా ఉంటాడు అనేది.. పెద్దయ్యాక చిన్నప్పుడు చేసుకున్న అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తారు అని ఆ సీరియల్ లో చూపిస్తారు.. 

 

చిన్నప్పుడు పెళ్లి చేస్తే అమ్మాయిల బాల్యం.. ఇంకా ముందు ముందు జీవితం నాశనం అవుతుంది అని ఆ సీరియల్ లో చూపిస్తారు.. ఇంకా ఆ సీరియల్ ప్రేమలు, కుటుంబాలు, అమ్మాయిల సమస్యలకు పరిష్కారాలు అన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించి బుల్లితెర ప్రేక్షకులకు ఈ సీరియల్ ని ఎంతో దగ్గర చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: