అయితే యాంకర్ రవి తన కెరీర్‌లో పలు ఛానెళ్లలో ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. వాటిలో చాలా వరకు విజయవంతంగా ప్రసారం అయినవే ఉన్నాయి. స్టాండప్ కామెడీ షోగా పరిచమయైన ఇది అతడికి ఎంతో పేరును తెచ్చి పెట్టింది. అయితే యాంకర్ రవికి వివాదాలు కొత్తేం కాదు. రవి కెరీర్‌లో చాలా సార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై అతడు చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయినా విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత అతడు క్షమాపణలు కూడా చెప్పిన తరహాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ రవిపై మహిళా సంఘాలు గొడవలు చేయడం మాత్రం ఆగడం లేదు. చాలా రోజుల తర్వాత దీనికి పుల్‌స్టాప్ పడింది.
ఇక అదిరింది షోలో భాగంగా అతడు రౌడీ బాయ్స్ టీమ్ స్కిట్‌లో యాక్టింగ్ చేశారు. అయితే అందులో రవి ఓ గ్రామీణ మహిళను మోసం చేసినట్లు చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. అంతేకాదు ఈ స్కిట్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న జడ్జ్ నాగబాబు సహాయం కోరుతాడు రవి. ‘ఏమోనయ్యా మేము నిన్ను నమ్మలేమంటూ నాగబాబు పంచ్ విసిరాడు. అంతటితో ఆగక నాగబాబు నువ్వు చేసినా చేసుండొచ్చు' అంటూ బదులిచ్చాడాయన. దీంతో అవాక్కయిపోతాడు రవి. యాదమ్మ రాజు, హరి కాంబినేషన్‌లోని టీమ్ ఈ స్కిట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి