అలనాటి మహానటి సావిత్రి ప్రేమి విశ్వనాథ్ రూపం లో మళ్లీ పుట్టిందని వీడియోలు ఎడిట్ చేసి మరీ సోషల్ మీడియా వేదికగా వదులుతున్నారు. దీంతో ప్రేమి విశ్వనాథ్ బాగా సంతోష పడిపోతున్నారు. బుల్లితెర సీరియల్ లలో నటించే వారి పేర్లు కూడా తెలియని మనకు మొదటిసారిగా కార్తీకదీపం సీరియల్ లో ప్రధాన పాత్ర లో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఆమె పై ప్రేమతో అభిమానులు ఆమె గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకొని బయట పెట్టారు. ప్రేమి విశ్వనాథ్ మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి మరీ ఆరాధిస్తున్నారు. జనాల గుండెల్లో ప్రేమి విశ్వనాథ్ వంటలక్క గా నిలిచిపోయారు.
https://www.instagram.com/p/CJjoNwHntIN/?utm_source=ig_web_copy_link
మొన్నీమధ్య స్టార్ మా ఛానల్ వాళ్ళు కార్తీకదీపం సీరియల్ నుంచి ప్రేమి విశ్వనాథ్ ని తీసేస్తున్నామని ప్రకటించినట్టు వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రేక్షకులు మాత్రం ప్రేమి విశ్వనాథ్ ని తీసేస్తే స్టార్ మా ఛానల్ ని బహిష్కరిస్తామని పెద్ద ఎత్తున సైబర్ ధర్నా చేశారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లో పెద్ద వర్షాలు రాగా.. నగరవాసుల ఇల్లులు నీట మునిగాయి. అయినా కూడా వంటలక్క సీరియల్ వచ్చే సమయంలో టీవీ లు ఆన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు జనాలు. ఈ సీరియల్ కి ఆ లెవల్లో ఆదరణ ఉండబట్టే టిఆర్పి రేటింగ్ ఆ స్థాయిలో వస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు తనని అలనాటి సావిత్రి తో పోల్చడం తో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి