
భాషరాకున్నా.. భావాన్ని పలికిస్తూ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోది ఈ కేరళ కుట్టి. ఎంత సహనంగా ఉంటుందో.. కోపం వస్తే అందరినీ అంతం చేసేంత ఉగ్రరూపంలోకి మారిపోతూ ఉంటుంది వంటలక్క. అందులోనూ వంటలక్క కోపంగా ఉన్నప్పుడు చూడాలి ప్రేక్షకుల ముఖ చిత్రాలు.. చంపు వంటలక్కా.. చంపు నీ జీవితాన్ని నాశనం చేసిన మోనిత అంతు ఈ రోజు అటో ఇటో తేల్చేయి అంటూ ఆవేశపడిపోతుంటారు ఆమె అభిమానులు. అంతగా అడిక్ట్ అయ్యారు ప్రేక్షకులు. అందుకే కదా ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకుల మనసును అలవోకగా దోచుకుంది ఈ చిన్నది. ఇంత ఫాన్స్ ఫాలోయింగ్ ను తెచ్చుకున్న వంటలక్క గురించి అయితే తెలుసు గాని ఆమె భర్త ఎవరనేది ఎంతమందికి తెలుసు..
ఖచ్చితంగా ఇదైతే చాలా తక్కువ మందికే తెలుసుకదా.. దీప గా ప్రేమి విశ్వనాథ్ ఎంత ఫేమసో ఆమె భర్త కూడా అంతే ఫేమస్సేనండోయ్. ప్రేమి విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్. ఈయన ప్రాముఖ్యత పొందిన జ్యోతిష్యులు. వంటలక్క భర్త వినీత్ కు 2017 లో వరల్డ్ బెస్ట్ అస్ట్రాలజర్ గా కూడా మాంచి గుర్తింపును అందుకున్నారు. అయితే ప్రేమి విశ్వనాథ్ తన భర్త గురించి ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఈ రోజు నటిగా మనముందు ఉండానికి కారణం తన భర్త వినీతే కారణమట. ఆయన సహకారం లేకపోతే తనకు ఇంతమంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేవే కాదని చెప్పింది వంటలక్క ప్రేమి విశ్వనాథ్. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ కు తెలుగు, మళయాళంలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి