బిగ్ బాస్ ఫేమ్ అరియానా అవినాష్ జంటకు క్రేజ్ రోజు రోజుకు పెరిగి పోతుంది.. ఎక్కడ చూసినా వీరి జంటనే సందడి చేస్తున్నాయి. పలు టీవీ షో లో పాల్గొంటూ బాగా వైరల్ అవుతున్నారు.ఇద్దరు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో బయట వారికి పెరిగిన క్రేజ్ గురించి తెలియదు. అయితే ఒక్కసారి బయటకు వచ్చాకు వారి ఇమేజ్, వారి కెమిస్ట్రీ గురించి తెలుసుకున్నాక షాక్ అయ్యారు. అందుకే అలా ఆ కెమిస్ట్రీ ఇంకా ముదిరిపోయేలా చేస్తూ ఇతర షోల్లో అరియానా అవినాష్‌లు రెచ్చిపోతోన్నారు..బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో అవినాష్ అందరితోనూ పులిహోర కలిపాడు. ఆ సంగతి అందరికీ తెలిసిందే.


 మోనాల్, దివి, సుజాత, అరియానా ఇలా ఇంట్లో ఉన్న అమ్మాయిలతో పులిహోర కలుపుతో కాలాన్ని గడిపాడు. అయితే చివరకు మాత్రం అరియానాకు ఫిక్స్ అయ్యాడు.అరియానా అవినాష్ జంటకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మొదట్లో ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు అరియానా తన ప్రేమ గురించి అసలు విషయంచెప్పింది. తాను ఆల్రెడీ ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే అప్పటి నుంచి అరియానా అవినాష్‌లను ఫ్రెండ్స్‌లానే చూస్తు వచ్చారు.  స్టార్ మా లో ప్రసామవుతున్న కామెడీ షో లో ఈ మ్యాటర్ పై నోరు విప్పాడు..


బుల్లితెరపై ఇప్పుడు ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. అందుకే సుమ హోస్ట్ చేస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోలోనూ అరియానా అవినాష్‌లు సందడి చేశారు. అరియానా, అవినాష్ సుజాతలు ఓ టీం.. అమ్మ రాజశేఖర్, దివి, కరాటే కళ్యాణిలు మరో టీంగా సుమ సెట్ చేసింది... ఆ తర్వాత మూడు నెలలు నీతోనే ఉన్నా అని అంటే అనడం అందరికీ షాక్ ఇచ్చింది. మూడు నెలలు నాతోనా? అంటూ అవినాష్ ద్వంద్వార్థం వచ్చేలా మళ్లీ ఒత్తి పలకడం రచ్చగా మారింది. మూడు పూటల్లో రెండు పూటలు తినిపించావ్ అంటూ అరియానా అనడం.. పక్కనుంచి సుజాత అందుకుని నాక్కూడా తినిపించావ్ కదా అని సెటైర్ వేయడంతో అవినాష్ గాలి పోయింది..మొత్తానికి అలా ఆకట్టుకుంది..రేపు ఇంకెలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: