సాధారణంగా  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారికి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. అయితే వచ్చిన అదృష్టాన్ని కాదని కోకుండా సద్వినియోగం చేసుకుంటే అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు. అయితే ఇలాంటి అదృష్టమే ఇప్పుడు ఒక ముద్దుగుమ్మను వరించింది. అయితే ఆ అదృష్టం ఏమిటంటే ఆమె సీరియల్స్లో హీరోయిన్గా అడుగుపెట్టింది ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆమె అందచందాలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటే సరాసరి సినీ ఇండస్ట్రీలోని దర్శకుల కంట పడింది. ఇక అంతే ఆమె అదృష్టం ఎంతలా మారింది అంటే ఆమె ఏకంగా మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసేంత.. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరు? ఏ సీరియల్ లో నటించింది ? ఏ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది అని ఆలోచిస్తున్నారా ? అయితే ఆ విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి వివరాల్లోకి వెళితే, జీ తెలుగు లో ప్రసారమయ్యే "పక్కింటి అమ్మాయి" అనే సీరియల్ ద్వారా హీరోయిన్ గా బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ఆస్రాని. "పక్కింటి అమ్మాయి"  సీరియల్ ద్వారా ఎంతోమంది మనసులను దోచిన ఈమె , అనతి కాలంలోని వెండితెరపై హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ క్రమంలోనే వెండితెర పైకి  "మళ్లీ రావా " అనే సినిమా ద్వారా  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత "ప్రెజర్ కుక్కర్ , ఏ-యాడ్ ఇన్ఫినిటీయం వంటి తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించి, అందరిని ఆకట్టుకున్నారు.


 అయితే ఇటీవల పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ప్రీతి ఆస్రాని, సోషల్ మీడియాలో  మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన  అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ ఒక ఫోటో షూట్ ని నిర్వహించి , ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఆమె అందానికి, ఆమె ఇచ్చిన ఫోజులకు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: