స్టార్ మా కొత్త షో లకు కేరాఫ్ గా మారింది.. బిగ్ బాస్ లాంటి పాపులర్ షో లను అందించిన మా.. ఇప్పుడు డ్యాన్స్ ప్లస్ షో ద్వారా ఆకట్టుకుంటుంది.యాంకర్, డైరెక్టర్‌ ఓంకార్ హోస్టుగా డ్యాన్సీ ప్లస్ షో విశేషంగా ఆదరణ సంపాదించుకొన్నది. ఈ షోకు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ఈ వారాంతంలో ప్రసారం కానున్నది. అయితే ఈ షోలో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఈ షో ఫైనల్ ఎపిసోడ్ ఇప్పటికే పూర్తి అయినందున ఆ విజేత వివరాలు మీడియాలో లీక్ అయ్యాయి..

12 మంది కంటెస్టెంట్లతో కూడిన టీమ్స్, ఆరుగురు జడ్జీలు, ఒక హోస్టుగా షో ప్రారంభమైంది. 12 జట్లల్లో రెండు జట్లకు ఒక జడ్జీని కేటాయించారు. దీంతో ఈ కార్యక్రమం మరింత క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఆట డ్యాన్స్ షోతో అత్యంత పాపులారిటీని సొంతం చేసుకొన్న ఓంకార్ ఈ షోను అద్భుతంగా డిజైన్ చేశారనే అభిప్రాయం అభిమానుల్లో వినిపిస్తుంది. ఇకపోతే మాస్టర్, బాబా భాస్కర్, రఘు మాస్టర్, యశ్వంత్, మోనాల్ గజ్జర్, ముమైత్ ఖాన్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు.


అని మాస్టర్ గ్రూప్‌లో జియా థాకూర్, టీమ్ వెలాసిటీ, బాబా భాస్కర్ టీమ్‌లో అంచీ ముంబై, నివేదిత, టీమ్ రఘు కింద డార్జిలింగ్ డెవిల్స్, తేజస్విని, మహేశ్వరి, యశ్వంత్ టీమ్‌లో సంకేత్ సహదేవ్, వాసి టోని, టీమ్ మోనాల్‌లో ఎంఎంకే, లుంగా మామాస్, టీమ్ మమైత్ ఖాన్ జట్టులో రామ్ లక్ష్మన్, 8 కౌంట్జ్ ఉన్నారు. ఈ షో గత కొన్ని రోజులుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. అయితే ఈ షో లో విన్నర్ ఎవరు అనేది అందరికీ ముందుగానే అందరికీ తెలిసిపోతుంది.. సంకేత్ విన్నర్.. అతనికి స్టార్ మా 20 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తుంది.. స్టార్ మా ప్రసారమవుతున్న ఏ షో కు సంబందించిన సీక్రెట్స్ అయిన ముందుగానే బయటకు రావడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: