బుల్లితెర మీద ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో వదినమ్మ సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో మొండితనం పాత్రలో నటిస్తున్న "భరత్" ..ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతని అసలు పేరు"చరణ్ రాజ్"అయితే ఈయన నాటికల్లోకి రాకముందు కొన్ని సినిమాలలో నటించాడు. ఇతను గురించి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

చరణ్ రాజ్..ఇతనిని అందరూ "రాజ్"  అని పిలుస్తుంటారు. ఈయన ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇతని జన్మస్థలం ఏపీ లోని గుంటూరు జిల్లాలో పుట్టాడు. రాజ్ బాగా చదివి ఎస్సై కావాలని అనుకున్నారు. ఇది వాళ్ళ అమ్మ ఆకాంక్ష కావడం వల్ల తను బాగా చదివి డిగ్రీలో ఉత్తీర్ణులయ్యారు. ఎస్ ఐ సెలెక్షన్  మొత్తమంతా అయిపోగా.. చివరిగా ఫైనల్ ఎగ్జామ్ లో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆ పోస్ట్ కి అర్హత సాధించలేకపోయారు.

అయితే రాజ్ అలాగే చదువుకుంటూ ఎంబీఏ పూర్తి చేయడానికి హైదరాబాద్ కి వెళ్ళాడు. అలా వెళ్లిన రాజ్ సినిమాలో ఏదైనా పాత్ర ఇవ్వండి అంటూ చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. దాంతో చివరిగా ఒక సినిమాలో (ఓంశాంతి మూవీ) లో అవకాశంతో మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలా మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు రాజ్.

ఇక అంతలోనే అక్కడున్న  ఒక డైరెక్టర్ తనని సీరియల్స్ లో ట్రై చేయమని సలహా ఇవ్వడంతో..2010 లో కార్తి అనే సీరియల్ తో బుల్లితెరపై అడుగు పెట్టాడు. అంతటితో ఆగకుండా జెమినీ టీవీలో ప్రసారమయ్యే అగ్నిపూలు, జీ తెలుగు లో ప్రసారమయ్యే.. గోరంత దీపం, మరియు రాములమ్మ సీరియల్ లో నటించాడు.

ఇక అంతే కాకుండా సంపూర్ణేష్ బాబుతో కలసి నటించిన "హృదయ కాలేయం", కొబ్బరి మట్ట అనే సినిమాలలో నటించాడు. ఈయనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: