
బుల్లితెరపై ఎక్కువ సేవలు చేసే ఏకైక హీరో ప్రదీప్ అని చెప్పవచ్చు. శ్రీముఖి మాత్రం తన సహ నటులతో అల్లరి చేష్టలు చేస్తూ అందరిని ఎంతగానో నవ్విస్తూ ఉంటుంది. దీంతోనే "రాములమ్మ"గా పేరు కూడా తెచ్చుకుంది. శ్రీముఖి ప్రదీప్ వీరిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నదని పలుసార్లు తెలిపారు. ఇక అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఉందని కూడా ఒకప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ ఆ వార్తలను వీరు పెద్దగా పట్టించుకోలేదు. వీరిద్దరి మధ్య ఏమీ లేదని పలుమార్లు, వీరు పలు షోలలో తెలిపారు. అయితే మరో సారి వీరిద్దరూ కలిసి బుల్లి తెరపై ఒక షో లో కనిపించనున్నారు. అయితే ఈ షోలో యాంకర్ శ్రీముఖి , ప్రదీప్ తో ఏకంగా "ఐ లవ్ యు"చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది శ్రీముఖి. అది ఎక్కడ అంటే జీ తెలుగు లో ప్రసారమయ్యే"డ్రామా జూనియర్స్" షో కి యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా పని చేస్తున్నారు. ఈ షోకి యాంకర్ శ్రీముఖి కూడా వచ్చింది.
ఇక ఇందుకు సంబంధించి ఒక ప్రోమో విడుదల అయింది. ఇందులో "జగదేకవీరుడు గా ప్రదీప్, అతిలోక సుందరిగా శ్రీముఖి"వచ్చింది అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. శ్రీముఖి ఇందులో డాన్స్ వేసుకుంటూ వచ్చి తన మనసులో మాటను చెప్పింది శ్రీముఖి . ఇక అలా చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు.