కరోనా రావడంతో టాలీవుడ్ లో సినిమాల పరిస్థితి చాలా ఘోరంగా మారింది. దీంతో ఎక్కడ షూటింగ్స్ అక్కడే నిలిచిపోయాయి. ఇక థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని చిన్న సినిమాలు మొదట విడుదల చేయగా.. ఆ తరువాత నెమ్మదిగా పెద్ద పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

1). ఇచట వాహనములు నిలుపరాదు:
సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం ఇచట వాహనాలు నిలుపరాదు. ఈ సినిమా అప్పుడే థియేటర్లో విడుదల అయ్యి, మరి ఇప్పుడు...ఈ నెల 17న ఆహాలో విడుదలకానుంది.

2). అన్ బెల్ సేతుపతి..
హీరో విజయ్ సేతుపతి, తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం అన్ బెల్ సేతుపతి. ఈ చిత్రం ఈ నెల 17న.. డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

3). విజయ రాఘవన్:
టాలీవుడ్లోకి బిచ్చగాడు సినిమా తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన సినిమాలు తీసి కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయరాఘవన్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్లలో విడుదలకానుంది.

4) గల్లీ రౌడీ:
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి హిట్ ను అందుకున్నాడు హీరో సందీప్ కిషన్. ఇక ఆ తర్వాత ఈయనకి ఏ సినిమాలు సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఇక ప్రస్తుతం గల్లీ రౌడీ అనే సినిమాలో నటించాడు.. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది.

5). నితిన్ మాస్ట్రో:
నితిన్ హీరోగా, నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మాస్ట్రో.. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కూడా ఈ నెల 17న డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

6). డోంట్ బ్రీత్-2:
హర్రర్ నేపథ్యంతో కూడిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: