బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీఆర్పీ విషయంలోనూ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో లహరి నే ఎలిమినేట్ అవుతుంది అని సోషల్ మీడియాలో సందడి అయినట్టే రాత్రి జరిగిన ఎపిసోడ్ లో లహరి ఎలిమినేట్ అయింది. అయితే ఇంటి సభ్యులు మరియు లహరి ఫ్యాన్స్ ఇది ఊహించి ఉండకపోవచ్చు. ముఖ్యంగా హౌస్ లో అందరి కన్నా రవి మరియు ప్రియ లు చాల్ బాధపడ్డారు. ఎందుకంటే వారిద్దరూ చేసిన పని వల్లే తను నామినేట్ అయింది మరియు ఆ వారం హైలైట్ అయి ప్రజల దృష్టిలో చెడుగా పోర్ట్రైట్ అయింది. దీనితో టైటిల్ కంటెండర్ గా అనుకున్న లహరి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయింది. 

అయితే ఎప్పటి లాగే ఎలిమినేట్ అయ్యే ముందు ఇంటి సభ్యుల గురించి ఎదో ఒకటి చెప్పాలి. అందులో భాగంగా అందరి గురించి చెబుతూ షణ్ముఖ్ దగ్గరకు వచ్చే లోగా, సిరి నామినేట్ చేసిందని నన్ను నామినేట్ చేశావ్... అలా ఆ ఓటు పడకపోయి ఉంటే నేను నామినేషన్ వరకు వచ్చేదాన్ని కాదు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా సార్లు ఆలోచించి తీసుకో అని చెప్పింది లహరి. అయితే ఈ మాటలతో కొంచెం ఫీల్ అయినట్లు మాట్లాడాడు షణ్ముఖ్. దీనితో ఇంటి సభ్యులు అందరికీ కూడా వారిద్దరి గేమ్ ప్లాన్ అర్థమయింది.

 ఈ ఎపిసోడ్ తర్వాత మిగిలిన ఇంటి సభ్యులు అంతా వీరిద్దరి మీద ఒక కన్నేసి ఉంచడం పక్కా అని తెలుస్తోంది. ముఖ్యంగా నామినేషన్ సమయంలో ఒక్క ఓటు కూడా చాలా కీలకం అవుతుంది. ఆ విధంగా ఇంటి సభ్యులకు ఇక వీరిద్దరే టార్గెట్ కానున్నారు. మరి ఈ రోజు నుండి షణ్ముఖ్ మరియు సిరి లు ఏ విధంగా తమ ఆటను కొనసాగిస్తారో చూడాలి. కాగా ఈ రోజు నామినేషన్ ప్రక్రియ జరగనుంది. ఈ వరం ఎవరెవరు నామినెటే కానున్నారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: