బిగ్ బాస్ షో 5వ సీజ‌న్‌లో ఎప్ప‌డు జ‌రిగేవిధంగానే సోమ‌వారం నాడు నామినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగింది. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఆదివారం ఎలిమినేట్ కావ‌డంతో ఇప్పుడు ప్ర‌స్తుతం హౌస్‌లో 15 మంది మాత్ర‌మే ఉన్నారు. బిగ్ బాస్ షో మొద‌టి వారంలో స‌ర‌యి, రెండ‌వ వారంలో ఉమాదేవి, మూడ‌వ వారంలో ల‌హ‌రి ఎలిమినేట్ అయిన విష‌యం విధిత‌మ‌మే. తాజాగా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు. సోమ‌వారం నిర్వ‌హించిన ఎపిసోడ్‌తో బిగ్ బాస్ మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 30 ఎపిసోడ్‌ల‌ను కంప్లీట్ చేసుకుంది. నామినేష‌న్ విధానంలో  ఈసారి ఒక్కొక్క‌రూ  ఇద్ద‌రినీ నామినేట్ చేయాల‌ని బిగ్ బాస్ వెల్ల‌డించాడు. దీంతో జెస్సీ యాంక‌ర్ ర‌వి, లోబోను నామ‌మినేట్ చేసింది. అదేవిధంగా విశ్వ జెస్సీ, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ను, స‌న్నీ ష‌ణ్ముఖ్‌, ప్రియ‌ను, కాజ‌ల్ యాంక‌ర్ ర‌వి, ష‌ణ్ముఖ్‌ను, ప్రియాంక హ‌మిదా, లోబోను, లోబో మాన‌స్, ష‌ణ్ముఖ్‌ల‌ను నామినేట్ చేశారు.
సిరి యాంక‌ర్ ర‌వి, హ‌మిదాను, యాంక‌ర్ ర‌వి జెస్సీ, ష‌ణ్ముఖ్ బ‌స్వంత్‌ను, ఆని మాస్ట‌ర్ యాంక‌ర్‌ర‌వి, విశ్వ‌ల‌ను, ష‌ణ్ముఖ్ బ‌స్వంత్‌.. విశ్వ, మాన‌స్‌ను,  హ‌మిదా ప్రియా, ష‌ణ్ముఖ్‌ల‌ను,  శ్వేత‌ మాన‌స్, కాజ‌ల్‌ను, ప్రియ‌.. ష‌ణ్ముఖ్ బ‌స్వంత్, స‌న్నీల‌ను,  మాన‌స్ జెస్సీ, ష‌ణ్ముఖ్ బ‌స్వంత్‌ల‌ను, శ్రీ‌రామ్‌..జెస్సీ, ష‌ణ్ముఖ్ బ‌స్వంత్‌ల‌ను నామినేట్ చేశారు. ఈ నామినేష‌న్ విధానం ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడు జ‌ర‌గ‌ని విధంగా స‌రికొత్త‌గా నూత‌నంగా జ‌ర‌గ‌డంతో ష‌ణ్ముఖ్ బ‌స్వంత్‌ను ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ చేశారు.
ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల బిగ్ బాస్ షోలో నాగార్జున న‌టించిన నిన్నే పెళ్లాడుతా సినిమ‌మా వ‌చ్చి 25 సంవ‌త్స‌రాలు గ‌డిచిన సంద‌ర్భంగా కంటెస్టెంట్లు స్పెష‌ల్ ఫ‌ర్ప‌మెన్స్ చేసిన విష‌యం విధిత‌మే. అంద‌రినీ టీమ్‌లుగా విభ‌జించి ఢ్యాన్స్‌లు చేశారు. ఢ్యాన్స్ చేస్తుండ‌గా మాన‌స్ ఒక్క‌సారిగా జారీ స్విమ్మింగ్ పూల్ లో ప‌డ్డాడు. ర‌వి గుంట‌న‌క్క అని.. మాన‌స్ గాడిద అని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ బ‌య‌ట‌పెట్టాడు.  మొత్తానికి ఆనీ మాస్ట‌ర్ సేఫ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు.  ఇదంతా ఒక ఎత్త‌యితే నామినేష‌న్ ప్ర‌క్రియ మ‌రోక ఎత్తు.. శ్రీ‌రామ్‌, మాన‌స్‌, ప్రియ‌, హ‌మిద‌, ర‌వి, లోబో, విశ్వ‌, స‌న్నీలు ఇలా అంద‌రూ ష‌ణ్ముఖ్ బ‌స్వంత్‌ను నామినేట్ చేశారు. ష‌ణ్ముఖ్ మాత్రం కొంచెం ఫీల్ అయిన‌ట్టు క‌నిపించింది. బిగ్ బాస్ షోలో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రు  సృష్టించ‌ని స‌రికొత్త రికార్డును ష‌ణ్ముఖ్ సృష్టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ ద‌క్క‌ని ఘ‌న‌త ష‌ణ్ముఖ్ బ‌స్వంత్‌కు మాత్ర‌మే ద‌క్కింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.  
     

మరింత సమాచారం తెలుసుకోండి: