ఇదివరకే మా ఎన్నికలు రసవత్తరంగా జరిగి ఒకరికొకరు పోట్లాడుకోవడమే కాదు.. చాలా ఘోరంగా దూషించుకున్నారు కూడా.. అయితే ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు విజయాన్ని సాధించి మా పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. మా ఎన్నికలలో మంచు విష్ణు గెలవడానికి గల కారణం.. లోకల్.. నాన్ లోకల్ అనే ఒక ప్రశ్న ఎదురవడంతో చాలామంది లోకల్ ని గెలిపించుకోవడం కోసమే మంచు విష్ణుకు ఓట్లు వేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంచు విష్ణు ఇద్దరూ కూడా బావబామ్మర్దుల కాబట్టి జగన్ మేనిఫెస్టో కి దగ్గర పోలికలతో విష్ణు మేనిఫెస్టో కూడా ఉండడంతో అందుకే చాలామంది మంచు విష్ణు కు ఓట్లు వేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా మా ఎన్నికలకు సంబంధించి లోకల్, నాన్ లోకల్ అనే విషయంపై నటుడు రాజీవ్ కనకాల కూడా స్పందించడం జరిగింది. చాలామంది సుమ కూడా నాన్ లోకల్ కదా.. ఆమె ఎలా లోకల్ అవుతుంది అనే వార్తలు వినిపించడంతో ఒక్కసారిగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు రాజీవ్.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. సూపర్ స్టార్ గా గుర్తింపు పొందుతున్న రజనీకాంత్ కూడా తమిళ సినీ ఇండస్ట్రీలో 40 నుంచి 50 సంవత్సరాల పాటు కొనసాగుతున్నాడు.మరి  ఆయనను లోకల్ అని అంటారు.. నాన్ లోకల్ అని అంటారా.. లోకల్ అనే కదా అంటారు..


మరి సుమ కూడా నన్ను పెళ్లి చేసుకొని తెలుగు రాష్ట్రానికి వచ్చి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతోంది. తెలుగు ఇంటి కోడలిగా తెలుగు చక్కగా మాట్లాడుతూ.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకవేళ ఆమె ఇక్కడ కూడా మలయాళం మాట్లాడి ఉండి ఉంటే, తనను నేను పెళ్లి చేసుకునే వాడిని కూడా కాదు అంటూ రాజీవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాదు ప్రకాష్ రాజ్ విషయంలో కూడా నేనెప్పుడూ లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని తీసుకురాలేదు.. ఇక సోషల్ మీడియా వాళ్లు కూడా హెడ్డింగ్ పెట్టేటప్పుడు చూసుకొని ఆలోచించి , ఏం జరిగిందో తెలుసుకొని పెడితే చాలా బాగుంటుంది అంటూ మీడియా వాళ్లకి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: