ప్రముఖ స్టార్ హీరోయిన్..అలనాటి అందాల తార రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ను బుల్లితెరపై స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. జానకి కలగనలేదు అనే సీరియల్లో అత్త పాత్రలో , అమ్మ పాత్రలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటోంది.. స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది  అంటే.. ఇందులో నటించే నటీనటులు అందుకు కారణమని చెప్పాలి.. ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు చాలామంది కేవలం రాశి కోసమే ఈ సీరియల్ ను చూస్తున్నారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు..

ఇక రాశి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి.. రాశికి కోడలుగా వచ్చిన జానకి.. ఈమె జానకి కలగనలేదు సీరియల్ లో  లీడ్ రోల్ పోషిస్తోంది.. జానకి అసలు పేరు ప్రియాంక జేన్. ఈమె 1998 జూలై 2వ తేదీన ముంబైలో జన్మించింది. ఇక ఈమె తల్లి పేరు ఫాల్గున్ జేన్.. తండ్రి పేరు ప్రశాంత్ జేన్.. తమ్ముడి పేరు జెనిల్ జేన్.. స్కూలింగ్ అలాగే కాలేజ్ మొత్తం బెంగళూరులో పూర్తి చేసింది. అందరి నటీనటుల లాగే మొదట తన కెరీర్ ను  మోడల్ గా ప్రారంభించింది.

మొదట కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమాలలో నటించిన ఈమె, తెలుగులో మౌనరాగం సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. మౌనరాగం సీరియల్లో అమ్ములు పాత్రలో చాలా అద్భుతంగా నటించిన ప్రియాంక , తన ప్రతిభను నిరూపించుకుంది. మౌనరాగం సీరియల్ లో నటిస్తూనే మరొక తమిళ్ సీరియల్ లో కూడా నటించి అక్కడ కూడా తమిళ్ బుల్లితెర ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. ఇక ప్రస్తుతం జానకి కలగనలేదు అనే సీరియల్లో లీడ్ రోల్ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: